సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అనుచర వర్గంతో గత రెండు రోజుల నుంచి ప్రత్యేక హోదా కోసం సినీ నటులు కూడా పోరాడాలన్న రీతిలో మాట్లాడిస్తున్న నేపథ్యంలో యావత్ టాలీవుడ్ పెద్దలు వారి గళానికి పదును పెట్టారు. ప్రజల సొమ్ముతో ఏసీ రూముల్లో కూర్చొని హీరోయిన్లతో హీరోలు కులుకుతున్నారంటూ చంద్రబాబు అనుచర వర్గం చేసిన మాటలకు ఘాటుగానే స్పందించారు. కాగా, మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళీ మీడియా ముఖంగా స్పందించిన విషయం తెలిసిందే.
see also : ఎల్లో మీడియాను చెంపమీద కొట్టే ఆర్టికల్..! ఒక్కో షేర్‌తో.. ఒక్కో చెప్పుదెబ్బ..!!
see also : కొండ నాలుక్కి ఉప్పేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది బాబు పరిస్థితి..!
ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ప్రముఖులను సన్నాసుల్లాగాను, దద్దమ్మల్లాగానూ సంభాషించడం సరికాదన్నారు. నాడు ప్రత్యేక హోదా కోసం పోరాడిన వాళ్లను నడి రోడ్డుపై బట్టలూడదీసి కొట్టించిన నీకు (చంద్రబాబు) మాట్లాడే అర్హత లేదన్నారు. అందులోనూ సినీ నటుడు సంపూర్ణేష్‌బాబును ఏకంగా జైల్లో పెట్టించింది నిజం కాదా 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేర్చావా.? కోట్లకు కోట్లు పోసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరమేమొచ్చింది అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు తమ్మారెడ్డి భరద్వాజ.