ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారుకు కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది.ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు సంజీవని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చుల నిధులలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను కోత విధించింది.
మొదటిగా నాబార్డు ద్వారా మొత్తం పద్నాలుగు వందల కోట్ల రూపాయలను తీసుకునేందుకు అనుమతి ఇచ్చిన కేంద్రం రెండు రోజుల్లోనే మాట మార్చింది.ఈ క్రమంలో పోలవరం అధారిటీకి రూ ఒక వెయ్యి ఎనబై తొమ్మిది కోట్లను మాత్రమే ఇవ్వాలని జలవనరుల శాఖ ఆదేశించింది.ఇప్పటికే విభజన హామీలను కేంద్రం అమలు అమలు చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తోరోకులు జరుగుతున్న సంగతి విదితమే ..