మంచు మోహన్ బాబు మరోసారి టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో ఎలా చేరతారు.ఎలా మంత్రులుగా వ్యవహరిస్తారు.ప్రజలకు ఏమి సేవ చేస్తారు అంటూ నిప్పులు చెరిగిన ఆయన తాజాగా మరోసారి ఆయన ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ లో సక్కగా సాగుచేసి నారు నాటితే వరిపెరుగుతుంది.అదే మాట జారితే గొడవలు పెరుగుతాయి.ఒక్కొక్కసారి యుద్ధాలు కూడా జరుగుతాయి.ఆ క్రమంలో మనం పతనం కూడా కావచ్చు.ఆ విధంగా ప్రత్యేక హోదా కావాలని టీడీపీ అంటుంది.
మరోసారి ప్రత్యేక ఫ్యాకేజీ కావాలంటుంది.మరల తిరిగి ప్రత్యేక ఫ్యాకేజీనే కావాలంటున్నారు.అదే బీజేపీ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంటుంది.ఇప్పుడేమో ప్రత్యేక ఫ్యాకేజీ అంటుంది.ప్రజలు అంతా గోర్రెలుగా కనిపిస్తున్నారా ..?అని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి..