తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గౌడ సామాజిక వర్గానికి వరాల జల్లు కురిపించారు .ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తాటి చెట్లకు చెల్లించే పన్నును రద్దు చేస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.
ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పన్ను ఉండదు అని ముఖ్యమంత్రి తెలిపారు .ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద పదహారు కోట్ల రూపాయల భారం పడుతున్న కానీ గౌడన్నల కంటే ఇదేమి భారం కాదు అని అన్నారు .ఇప్పటికే పెండింగ్ లో ఉన్న మొత్తం బకాయిలను రద్దు చేసినట్లు తెలిపారు.
అంతే కాకుండా లైసెన్స్ రెన్యూవల్ గడవును కూడా ఐదు నుండి పది ఏండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.వీరికోసం గౌడ సంక్షేమ భవన్ ను ఐదు కోట్ల రూపాయలతో ఐదు ఎకరాల స్థలంలో హైదరాబాద్ మహానగరంలో నిర్మించనున్నట్లు ప్రకటించారు.