CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఈ పేరు చెబితే అవినీతి అధికారులతోపాటు, పాలకులకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అధికారుల అవినీతిని, పాలకుల అవినీతిని ఆధారాలతో సహా ఎత్తి చూపడమే కాగ్ విధి విధానాలు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఖాతాలను పరిశీలించి వాటిలోని లోటుపాట్లను ఆధారాలతో సహా రాష్ట్రపతికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది.
see also : 2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!!
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల ఖాతాల వివరాలను కాగ్ వెల్లడించింది. అందులో ఏపీలోని చంద్రబాబు సర్కార్ రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదిక తేల్చేసింది. ఆ రూ.371 కోట్ల అవినీతి కూడా ఒక్క పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించినదే. రూ.371 కోట్ల అవినీతే కాకుండా మరో రూ.19 కోట్లు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణమంటూ వృథాగా ఖర్చు పెట్టారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఒరిజినల్ టెంటర్ల ప్రకారం, కన్వెన్షన్ సిస్టం ప్రకారం నిర్మాణం చేపట్టకుండా దొడ్డిదారిలో టెండర్లను పిలిచి చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడింది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం కోసం అసలు టెక్నాలజీతోపాటు ఆల్టర్నేట్ టెక్నాలజీ పేరుతో మరికొన్ని నిధులను స్వాహా చేశారు. అందులో చంద్రబాబుతోపాటు ఏపీ మంత్రులంతా పాట్నర్లేనంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. 371 కోట్ల అవినీతి జరిగిన పట్టిసీమ ప్రాజెక్టుపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.