ప్రజాసమస్యలపై పోరాడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు బుధవారం ఉదయం ఆయన ఉప్పలపాడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాలపర్తి చేరుకున్న వైఎస్ జగన్‌ను రాజుపాలెం గ్రామానికి చెందిన కొమిర చిన్నకీర్తి దంపతులు కలిశారు. తమ ఎనిమిది నెలల చిన్నారికి పేరు పెట్టాల్సిందిగా వైఎస్ జగన్‌ను కోరడంతో ఆయన విజయమ్మగా నామకరణం చేశారు. తమ అభిమాన నేత తమ బిడ్డకు పేరు పెట్టడంతో ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. అంతేగాక వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. వారందరితో కలిసి ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రజల బాధలు, సమస్యలు వింటూ యాత్ర కొనసాగిస్తున్నారు.
