ప్రజాసమస్యలపై పోరాడుతూ, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ..వాటి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడు. వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఉప్పలపాడు శివారు నుంచి 117వ రోజు పాదయాత్ర మొదలుపెట్టారు బుధవారం ఉదయం ఆయన ఉప్పలపాడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జరుగులవారిపాలెం, మిట్టాపాలెం, దండముడి, మానుకొండువారిపాలెం, చిలకలూరిపేట మీదగా పోలిరెడ్డిపాలెం వరకూ ఈరోజు పాదయాత్ర చేయనున్నారు. జగన్ వెంట నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వారందరితో కలిసి ఆయన ముందుకు సాగుతున్నారు. ప్రజల బాధలు, సమస్యలు వింటూ యాత్ర కొనసాగిస్తున్నారు.
