ఆయన ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యావంతుడు..లక్షల్లో జీతాలు ..హై ప్రొఫైల్ ఉన్న కంపెనీల నుండి ఉద్యోగాలు ఆఫర్లు .లగ్జరీ లైఫ్ ..అయిన అవి ఏమి అతన్ని ఆపలేదు.తను పుట్టిన గడ్డకు ..ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం.ఆరాటం అన్ని వెరసి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించాయి.అనుకున్నదే తడవుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత ఎమ్మెల్యే
అయ్యారు.ఎమ్మెల్యే కాగానే కొంతమందికి ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవన్నీ పక్కన పెడతారు.సొంత లాభం చూసుకుంటారు.కానీ ఈ యువకుడు ..యువనేత మాత్రం తను ఏమి ఉద్దేశ్యంతో అయితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో అదే నేరేవేర్చే పనిలో అహర్నిశలు కష్టపడుతున్నారు.
పగలు అనక రాత్రి అనక తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు.ఇంతకూ ఈ ఉపోద్ఘాతం అంతా ఎవరి గురించి ఆలోచిస్తున్నారా..అతనే రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాల్లో ఒకటి ..నగరంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజక వర్గం కుత్భుల్లా పూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ .గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు సహకారంతో తన నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు.తాజాగా ఆయన గత మూడు రోజులుగా సామాన్య ప్రజానీకం ప్రయాణించే ఆర్టీసీ బస్సులో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళుతున్నారు.
అందులో భాగంగా ఈ రోజు బుధవారం ఆయన నగరంలోని సుచిత్ర సర్కిల్ దగ్గర నుండి జీడిమెట్ల బస్సు ఎక్కి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయానికులను ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అంతే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయా ..లేదా అని అడిగి మరి తెలుసుకున్నారు.
అంతే కాకుండా తమకు ఏ కష్టమొచ్చిన కానీ షాపూర్ లోని తన ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ తన ఇంటికి కానీ వచ్చి చెప్పవచ్చు అని ..అవసరమైతే తనకు కాల్ చేసిన చాలు అని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రష్ టైమింగ్స్ లో లిమిటెడ్ బస్సు సర్వీసులతో అవస్థలు పడుతున్నట్లు గుర్తించాం…కొన్ని కూడళ్లలో ట్రాఫిక్ సమస్యతో బస్సు ప్రయాణం ఆలస్యం అవుతున్నట్లు ఈ ప్రయాణంలో తమ దృష్టికి వచ్చాయన్నారు . దాంతో పాటు మహిళలకు కొన్ని బస్సులు ప్రత్యేకంగా వేస్తే బాగుంటుందని గుర్తించామని త్వరలో వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు.చివరగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో బస్ స్టాప్ వద్గ దిగి కాలినడకన అసెంబ్లీకి లోపలకు వెళ్లారు ఎమ్మెల్యే.