సినిమాల్లో హీరోలు ఎంత డబ్బులు ఇస్తే, అంత పరిధిలోనే తన నటనను చూపిస్తారు… ఇప్పుడు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులది అదే పరిస్థితి.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో మాట్లాడుకున్న అగ్రిమెంట్ ముగిసినందునే పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారన్నారంటూ ఓ మహిళ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, ఇటీవల ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో పవన్ కల్యాణ్‌తో సహా, ఆయన అభిమానులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
see also : బీజేపీ పార్టీకి బిగ్ షాక్ ..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎప్పుడైతే ప్రజలు ఎదురు తిరుగుతారో.. అప్పుడే పవన్ కల్యాన్ ప్రజల దృష్టిని మరల్చేందుకు సభలు అంటూ ఎంట్రీ ఇస్తాడని, ప్రశ్నిస్తానని జనసేన పార్టీ పెట్టిన నీవు చంద్రబాబు అవినీతిపై ఎప్పుడైనా ప్రశ్నించావా..? ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై టీడీపీ నేతల దాడులు, పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు, తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడిని ఎప్పుడైనా ఖండించావా అంటూ ప్రశ్నించింది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైఎస్ జగన్‌ను విమర్శిస్తావా..? ఒక మేనిఫెస్టో ప్రజాభీష్టం మేరకు రూపొందించాలి. ఆ మేరకే వైఎస్ జగన్ నిత్యం ప్రజల్లో తిరుగుతూ మేనిఫెస్టో రూపొందిస్తున్నారన్నారు. సినిమాల్లో వారసత్వం పంచుకోవచ్చు కానీ, రాజకీయాల్లో వారసత్వం పంచుకోకూడదా అంటూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించింది ఆ మహిళ.
see also : చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులపై, అగ్రిగోల్డ్ వ్యవహారంపై, అలాగే, పోలవరం ప్రాజెక్టు అవినీతిపై, ప్రత్యేక హోదా సాధించాలనే లక్ష్యంతో ఇలా వైఎస్ జగన్ ఎన్నో దీక్షలు చేశారని, ఏనాడైనా నీవు ప్రజల కోసం దీక్షలు కానీ, ధర్నా కానీ చేశావా..? అంటూ పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.
పవన్ కల్యాణ్ అభిమానులను కోరేది ఒకటే.. మీరు సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, అవినీతిని ప్రశ్నించలేని జనసేన పార్టీలోకి వెళ్లి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ హితవు పలికింది.