అందితే జుట్టు…అందకపోతే కాళ్లు…అవసరం కోసం ఏదైనా తాము మాట్లాడగలం…తాము మాట్లాడిందే నిజం అనుకుంటారు అన్నట్లుగా వ్యవహరించే టీడీపీకి దిమ్మతిరిగి బొమ్మ కనబడే షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా…అదే పంచ్ తిరిగి ఆయనకు తగిలింది.టాలీవుడ్ హీరోలకు హీరోయిన్ల అందాలను వర్ణించడం తప్పా హక్కుల కోసం పోరాటం చేయరా అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేసే హీరోలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని, బానిస బతుకులు ఇంకెన్నాళ్లని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇకనైనా ఆంధ్రుల హక్కుల కోసం నడుం బిగించాలని, లేకపోతే తెలుగు సినీ పరిశ్రమను బహిష్కరిస్తామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఇలా పరుషమైనఈ కామెంట్లపై సినీ విమర్శకుడు కత్తిమహేశ్ ఘాటుగా స్పందించారు. `ఉన్న హీరోలందరూ ఎదో ఒక రకంగా మీ పార్టీకి సంబంధించిన వాళ్లేగా! బాలకృష్ణ ఒకరు చాలడా?అవార్డులు పంచుకున్న బ్యాచ్చి ఎక్కడ? మీరు వైజాగ్ లో భూములు ఇచ్చిన స్టార్లు ఎక్కడ?బొడ్డు, జఘనాల డైరెక్టర్ తిరుమలలోనే ఉన్నారుగా?బోయపాటి శీను ఎక్కడా? శివాజీ,పవన్ కళ్యాణ్, నిఖిల్ సిద్దార్థ, సంపూర్ణేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు మనోజ్, కొరటాల శివ,నేను ఆల్రెడీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడాము.
ఉద్యమాలలో పోరాడాము. నిన్నటికి నిన్న కళ్ళు తెరిచి హోదారాగం ఎత్తుకున్న టీడీపీ నాయకులు కళ్ళు నెత్తికెక్కినట్టు ఉన్నాయి. మాటలు జాగ్రత్త!` అంటూ పచ్చ బ్యాచ్ మైండ్ బ్లాంకయ్యే కామెంట్లు చేశారు.కాగా, టీడీపీని ఏకిపారేసి కత్తి మహేశ్ కౌంటర్‌పై సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. `హమ్మయ్య ఇప్పటికైనా నా పేరును & నేను చేసిన పోరాటాలను గుర్తించి నందుకు ధన్యున్ని __ కత్తి కి రెండు వైపుల పదును ఉంది అని రుజువు చేశావు` అంటూ తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. దీంతో టీడీపీ శ్రేణులు గప్ చుప్ అయిపోయాయి.