”కొంతమంది వేళ్ళను ఉపయోగించి సంపాదిస్తారు. కొంతమంది కాళ్ళను ఉపయోగించి సంపాదిస్తారు. చాలావరకు తమ మెదళ్ళను ఉపయోగిస్తారు. ఆఖరికి తమ గర్భసంచీలను కూడా అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. కాని కొంతమంది వారి శరీర అవయవాన్ని వాడుకుని వాళ్ల పొట్టలు నింపుకోవడం కోసం వ్యభీచారం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసిన వ్యభీచారం విచ్చలవిడిగా జరుగుతుంది. రోజు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మీరట్‌లోని హోటల్స్ వ్యభిచారానికి హబ్‌లుగా మారాయి. సదర్‌బజార్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని పలు హోటల్స్‌పై పోలీసులు దాడులు జరిపి 35 మంది సెక్స్‌వర్కర్లు, విటులను అరెస్ట్ చేశారు. ఆరుకు పైగా హోటల్స్‌పై పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జంటలను మహిళా కానిస్టేబుళ్ల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారిని బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీరట్ హోటల్స్‌లో కొన్నేళ్లుగా సెక్స్ రాకెట్ నడుస్తున్నట్టు సమాచారం. పోలీసు అధికారులు ముడుపుల మత్తులో ఈ బాగోతానికి సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.