పోసాని కృష్ణ మురళీ, ఎదుటివారు ఎంత గొప్పవారైనా..? ఏ స్థాయిలో ఉన్నా..? వారి మీద తన మనసులోని అభిప్రాయాన్ని ముక్కుసూటి తనంతో చెప్పే వ్యక్తి. సినీ రంగంలో నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా ఇలా పోసాని పోషించని పాత్రంటూ లేదు. అయితే, అటువంటి నటుడికి కోపం వచ్చింది. అంతలా పోసాని కృష్ణ మురళీకి కోపం రావడానికి కారణమేంటి. ఎవరేమన్నారు..? అందుకు స్పందించిన పోసాని కృష్ణ మురళీ ఏమని స్పందించారు. అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం.. రండి..!!
see also : మీ రాజకీయ జీవితం మా సినిమా వాళ్ళు వేసిన బిక్ష -పోసాని కృష్ణ మురళి ..!
ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ఇండస్ర్టీ కూడా భాగమవ్వాలని, ప్రజలు ఇచ్చిన డబ్బులతో ఏసీ రూముల్లో హీరోయిన్లతో కులుకుతూ కూర్చోవడం హీరోలకు తగదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నలకు ఘాటుగానే సమాదానం చెప్పారు.
see also : ఏపీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ..!
ఇంతకీ పోసాని కృష్ణ మురళీ ఏం మాట్లాడారంటే..!!
అవును, సినిమా వాళ్లు వెధవలే, దద్దమ్మలమే, బేవర్సు గాళ్లమే, బ్రోకర్స్‌మే ఒప్పుకుంటాం, కానీ, ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన మీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమనాలి..? రాజకీయ వ్యభిచారి అనాల్నా..? లేక బ్రోకర్ అని పిలవాలా..? ఏమని పిలవాలి నీవే చెప్పు అంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై మండిపడ్డారు పోసాని కృష్ణ మురళీ.
see also : వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!
నాడు, ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు విజయవాడకు వచ్చిన ఎందరో మహానుభావులు, మేధావులు చలసాని శ్రీనివాస్ వంటి వారిని చంద్రబాబు లాఠీలతో కొట్టించి జైల్లో వేసిన విషయాన్ని మరిచిపోయావా..? అంటూ ప్రశ్నించారు. రోజుకో మాట మాట్లాడుతున్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు ఎప్పుడో విశ్వాసం కోల్పోయారు. ఇక చంద్రబాబు రాజకీయ జీవితం క్లోజ్ అయినట్టే. అటువంటప్పుడు ఎవరిని నమ్మి మేము ప్రత్యేక హోదా కోసం రంగంలోకి దిగాలి. ఒక రోజేమో.. ప్రత్యేక హోదా వద్దంటావ్.. ప్యాకేజీ ముద్దంటావ్.. మరుసటి రోజు ప్యాకేజీ వద్దంటావ్.. హోదా కావాలంటావ్.. నీకన్నా ఊసరివెల్లి నయం. ఎప్పుడు ఏ రంగు వస్తుందో చెప్పగలం, నీవు ఎప్పుడు ఏం మాట్లాడతావో ఏపీ ప్రజలకు అర్ధంకాకుండా ఉంది అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళీ.