చంద్రబాబు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అంతేనా.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూడాను. అయితే, సీఎం చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తారని, అలాగే, ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబును చెప్పుకుంటారని పలు పత్రికలతోపాటు, రాజకీయ విశ్లేషకుల మాట. అయితే, చంద్రబాబు తీరును గమనించిన వారు రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
see also : 18 ఏళ్ళు కొడుకు ఉన్నా..తల్లి అక్రమ సంబంధం..ఏం జరిగిందో తెలిస్తే..!
see also : వైసీపీలోకి చిరుకి హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!
అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనించిన ఎవరైనా సరే చంద్రబాబు తీరును తప్పుబట్టక మానరు. అందుకు తగ్గట్టే చంద్రబాబు గురించి చెప్పుకునేందుకు అంశాలు చాలానే ఉన్నాయి మరీ. ఓ సారి చంద్రబాబు రాజకీయాలను పరిశీలిస్తే.. 2014 ఎన్నికల్లో ఓట్లు కోసం అమలు కాని హామీలు ఇచ్చి, తన కుఠిల రాజకీయ చాణుక్యతతో ప్రజలను మభ్యపెట్టి, మరో పక్క బీజేపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకుని, ప్రత్యేక హోదా సాధించే బాధ్యత నాది అనే మాటతో అధికారం చేపట్టిన చంద్రబాబు, తీరి అధికారం చేపట్టిక మీరెవరో నాకు తెలీయదనే రీతితో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.
ఏపీకి ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..?
ప్రత్యేక హోదా ఉంటేనే.. పరిశ్రమలు వస్తాయా..?
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?
కోడలు మగ బిడ్డను కంటానంటే..! అత్త వద్దంటాదా..? అంటూ ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతూ.. ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారు.
చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
మరోపక్క పోలవరం, మేమే నిర్మించుకుంటాం అంటూ ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకుని, కేంద్రం నుంచి మంజూరైన నిధుల్లో కోట్లకు కోట్ల నిధులను దారిమళ్లించి అవినీతికి పాల్పడి, ఆ అవినీతిని కాస్తా ప్రభుత్వ అధికారులపై వేసి, వారిని సస్పెండ్ చేసిన ఉదంతాలు ఎన్నో. ఇలా చంద్రబాబు అవినీతి భాగోతం గురించి చెప్పాలంటే చాలానే ఉందన్నది సోషల్ మీడియాలో కథనం సారాంశం.
వైశ్రాయ్ హోటల్ ఉదంతం :-
ఇక అసలు విషయానికొస్తే.. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల్లో ఒక ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఓ పోస్టు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతోంది. అదే.. చంద్రబాబు వైశ్రాయ్ హోటల్ రాజకీయం. 1983లో వైశ్రాయ్ హోటల్ వేదికగా నాడు చంద్రబాబు నాయుడు నడిపిన కఠిల రాజకీయాలే ఆయన్ను ముఖ్యమంత్రి చేశాయన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు తను అనుకూల ఎమ్మెల్యేలతో చర్చలు జరిపించి, మీరు ఒక్కరు తప్పా అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్రతీ ఒక్కరితోనూ మీరు తప్ప మిగతా వారంతా చంద్రబాబు వైపే ఉన్నారంటూ ప్రచారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న ఎమ్మెల్యేలందర్నీ వైశ్రాయ్ హోటల్‌లో బంధించేశారు. ఇలా చంద్రబాబు తన కుఠిల రాజకీయ, వెన్నుపోటు రాజకీయ ప్రస్థానాన్నినాటి నుంచే ప్రారంభించారనే విషయాన్ని ఓ సోషల్ మీడియా మళ్లీ గుర్తు చేస్తోంది.
వైశ్రాయ్ హోటల్ రాజకీయాన్నే.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలోనూ చంద్రబాబు అవలంభిస్తున్నారని రాజకీయ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ఓ సారి, మద్దతు ఇవ్వమంటూ మరోసారి ఇలా ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు పన్నని కుయుక్తులు లేవంటే అతిశయోక్తి కాదేమో మరీ.