పుచ్చకాయ పండింతో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తే సరిపోతుందంటూ…ఓ లెక్చరర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేరళలో వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు…దీంతో ‘వాటర్ మిలాన్’ఉద్యమం ఊపందుకుంది… ముఖ్యంగా ముస్లిం విద్యార్థినుల శరీర భాగాలను వర్ణిస్తూ… చేసిన ఆ వ్యాఖ్యలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి… ఇక మరికొందరు విద్యార్థినులు… సోషల్ మీడియా వేదికగా నగ్న చిత్రాలను పోస్ట్ చేసి… పుచ్చకాయలతో శరీర భాగాలను కవర్ చేసిన ఉన్న ఫొటోలను పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయమేంటంటే కేరళలోని కొజికోడ్‌లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజీలో లెక్చలర్‌గా పనిచేస్తున్నారు జౌహర్ మునవీర్. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మునవీర్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు… తను పనిచేసే కాలేజీలో 80 శాతం మంది అమ్మాయిలే ఉన్నారని… అందరూ లెగ్గిన్స్ ధరిస్తారని పేర్కొన్నారు. తమ శరీర భాగాల్నికప్పుకునేందుకు ముస్లింలు స్కార్ఫ్ ధరిస్తారని… కానీ, చాలా మంది అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారన్నారు. దాంతో మగవారు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా… వాటర్ మిలన్ పండిందో లేదో తెలియాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తే సరిపోతోందంటూ అమ్మాయిల శరీర భాగాల గురించి జౌహర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సదరు లెక్చరర్ వ్యాఖ్యలతో కేరళ వ్యాప్తంగా మహిళా, విద్యార్థి సంఘాలు వాటర్ మిలన్ ఉద్యమం చేపట్టాయి. కొన్ని చోట్ల అమ్మాయిలైతే ఏకంగా ఫేస్ బుక్ లో తమ నగ్న ఫోటోలు పెట్టి నిరసన తెలిపారు. ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిల శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడుతున్నారు. కొచ్చి నుంచి 200 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ వాటర్‌మిలన్ ఉద్యమం చేపట్టింది ఆర్తీ అనే సామాజిక కార్యకర్త… ఆమె ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కేరళలోని యువతులు పుచ్చకాయలతో తమ నిరసన తెలుపుతున్నారు.