వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల పరిస్థితి ముందు చూస్తె నోయ్యి ..వెనక చూస్తె గొయ్యి అన్నట్లుగా తయారైంది.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన నోట్ల కట్టలకు ,ప్రాజెక్టులకు ఆశపడి వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.వారిలో ఎంపీలు ఎస్పీవై రెడ్డి ,కొత్తపల్లి గీత,బుట్టా రేణుక ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం కానీ స్థితిలో ఉన్నారు.గత కొద్ది రోజులుగా ఇటు అధికార టీడీపీ అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై పట్టుబడుతున్న సంగతి తెల్సిందే.
మొదట వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన విశ్వాస నోటీసు మీద చర్చించడానికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారు.ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ అటు వైసీపీ తమ ఎంపీలకు విప్ జారిచేశారు.ఏకంగా టీడీపీ అయితే తమ పార్టీకి చెందిన వారంతా సభ జరిగే అన్ని రోజులు క్రమం తప్పకుండా హాజరవ్వాలి అని విప్ లో పేర్కొన్నారు.ఇక వైసీపీ అయితే అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు లేచి నిలబడాలని విప్ జారిచేశారు.అందులో భాగంగా ఇప్పుడు ఒకవేళ వైసీపీ పార్టీ విప్ ను ఫాలో అయి అవిశ్వాస తీర్మానం చర్చ నిలబడితే తమను సభ వైసీపీ వారిగా ..అదే టీడీపీ పార్టీ విప్ ను ఫాలో అయి లేచి నిలబడితే పార్టీ మారినందుకు అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ పలుమార్లు లోక్ సభ స్పీకర్ను కోరడంతో అనర్హత వేటు వేయడం ఖాయం ..
దీంతో ఇప్పుడు ఏమి చేయాలో అర్ధం కాక ..ఏవో ఏవో ఆశించి పార్టీ మారితే అవి ఇంకా తీరకముందే అనర్హత వేటు పడితే ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలొస్తే నిలబడి గెలవడానికి సత్తా లేదు.ఎందుకంటే వాళ్ళు పార్టీ మారారు తప్పా వైసీపీ క్యాడర్ చెక్కు చెదరలేదు అందుకు జగన్ నిర్వహించిన పాదయాత్రకు వచ్చిన స్పందనే నిదర్శనం..ఒకవేళ టీడీపీ తరపున బరిలోకి దిగి పోటిలో నిలబడితే గెలిచే అవకాశాలు అసలు లేవు.ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఎంపీలు టీడీపీ ఎంపీలు లేచినప్పుడు కాకుండా వైసీపీ వారు నిలబడినప్పుడు లేచి నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు.అంటే దీని ప్రకారం వీరంతా వైసీపీలో ఉన్నట్లే .. అందుకే జగన్ వేసిన స్కెచ్ తో ఆ ముగ్గురు ఎంపీలు బ్యాక్ టూ హోమ్ అన్నమాట ..ఇదన్నమాట లెక్క ..