ప్రజాసమస్యలపై పోరాడుతూ, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అసమర్ధతను ఎండగడుతూ ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ..వాటి గురించి క్లుప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడు. 116 రోజు (మంగళవారం ) ఈరోజు ఉదయం పెదనందిపాడు శివారు నుంచి ప్రారంభించి, అక్కడ నుంచి రాజుపాలెం క్రాస్, పాలపర్రు, పరిట్లవారిపాలెం క్రాస్, అన్నవరం క్రాస్ మీదగా ఉప్పలపాడు వరకూ చేరుకుని అశేశ ప్రభజనం మద్యలో సభ నిర్శహించి ముగించాడు. ఈ నేపథ్యంలో 117వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. బుధవారం ఉదయం ఆయన ఉప్పలపాడు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జరుగులవారిపాలెం, మిట్టాపాలెం, దండముడి, మానుకొండువారిపాలెం, చిలకలూరిపేట మీదగా పోలిరెడ్డిపాలెం వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.
