ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా అస్సలు పనికిరాడు, అతను ఓ జప్ఫా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కాగా, ఇటీవల జలీల్ ఖాన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే, అమరావతి నిర్మాణానికి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ సహకరించకుండా, నిత్యం అడ్డుపడుతున్నారన్నారు.
చంద్రబాబు సర్కార్‌పై సీబీఐ ఎటాక్..!!
చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. సార్ మీరు బీజేపీతో విడిపోయి మంచి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పట్నుంచి ఇప్పటి వరకు మనసులో చాలా బాధపడ్డా. కానీ, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ బీజేపీతో కొనసాగుతుండటంతో సమర్ధించుకున్నానని చెప్పారు. వైఎస్ జగన్‌కు ఏపీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అక్రమ వ్యాపారాలు ఉన్నాయంటూ జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు .