ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 29 సార్లు ఢిల్లీకి వెళ్లి.. ప్రత్యేక హోదా సాధన కోసం చేయని ప్రయత్నాలంటూ లేవని ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండి వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఏందేందీ.. మీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా..? 2016లో చేశారా..? 2017లో చేశారా..? 2018లో చేశారా..? మళ్లీ 2018 ఏప్రిల్ 6వ తేదీన మళ్లీ రాజీనామాలు చేస్తారా..? అంటూ వైఎస్ జగన్‌పై వెటకారం ప్రదర్శించారు. జైలుకెళ్లిన జగన్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించడం అసాధ్యమని వైఎస్ జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు.
see also : ఏపీ ప్రత్యేక హోదా అవసరం లేదు..పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు
వై ఎస్ జగన్ కాళ్లతో కాదు కదా..! మోకాళ్లపై నడిచినా కూడా ఈ జన్మలో సీఎం కాలేడని, టీడీపీపై ఆరోపణలు తప్ప జగన్‌కు వేరే పని లేదన్నారు. తమ ప్రభుత్వంలో 250 జనాభా ఉన్న ప్రతీ గ్రామానికి తారు రోడ్లు వేయించామన్నారు. కిడ్నీ వ్యాధుల గ్రామాలకు మార్చి 31నాటికి సుజల స్రవంతి నీరు అందిస్తామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు.