తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపు బుధవారానికి వాయిదా పడింది.గత కొద్ది రోజులుగా ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సంగతి విదితమే.అందులో భాగంగా ఈ రోజు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర సమాధానం ఇచ్చిన తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదన్ చారీ ప్రకటించారు.
ఈ రోజు సభలో మొదలైన ప్రశ్నోత్తరాల సమయంలో రైతన్నలకు సర్కారిచ్చే పెట్టుబడి సాయం ,హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ సౌకర్యం ,రైతు వేదికలు ,పలు రోడ్ల నిర్మాణం ,నగరంలో మెట్రో విస్తరణ తదితర పలు అంశాల మీద సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు ఆయా శాఖలకు చెందిన మంత్రులు సభ్యులకు సమాధానమిచ్చారు.
అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత దాదాపు పదిహేను నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.వాయిదా అనంతరం తిరిగి మొదలైన సభలో బడ్జెట్ మీద చర్చ చేపట్టారు ..