ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర మీడియాల్లో అత్యధికంగా ఉన్న తెలుగు న్యూస్ ఛానల్స్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో నడుస్తాయి అని ఇటు రాజకీయ విశ్లేషకులు అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పే ప్రధాన మాట.అంతటి విశ్వాసమైన మీడియా వర్గానికి చెందిన ఒక ప్రముఖ తెలుగు
న్యూస్ ఛానల్ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలోనే వైసీపీ పార్టీలో చేరనున్నారు అని కథనాన్ని ప్రసారం చేసింది.గతంలో ఇదే ఛానల్ కర్నూలు జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అతని సోదరుడు మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో పార్టీలో చేరబోతున్నారు అంటూ ఒక వారం రోజులు ముందుగానే ప్రత్యేక కథనాల మీద కథనాలను వండి వార్చి ప్రసారం చేశాయి.
See Also:లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
అదే విధంగా ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో ఒకటైన తూర్పు గోదావరి జిల్లాకు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు త్వరలోనే వైసీపీ గూటికి చేరనున్నారు అని వార్తలను ప్రసారం చేస్తుంది.గతంలో మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు గతంలో మాదిరిగానే పలు అభివృద్ధి పనులను చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు.అయితే ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన త్రిమూర్తులు ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని భావించిన కానీ చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు.దీంతో చిన్నబుచ్చుకున్న త్రిమూర్తులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఆ ప్రత్యేక కథనం.అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కానీ ప్రభుత్వం సహకరించకపోయిన కానీ తన సత్తాతో పలు అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు.
గతంలో “గుండు కొట్టించిన కేసు ఒకటి వెంటాడుతున్న కానీ దళిత సామాజిక వర్గాన్ని తన మంచి పనులతో దగ్గరగా చేసుకున్నాడు.అది రేపో మాపో కొట్టేయబడుతుంది.అయితే ప్రస్తుతం ఈ నియోజక వర్గం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉండగా అతనికి జగన్ ఎమ్మెల్సీ కట్టబెట్టి త్రిమూర్తులు రాకను సులభతరంచేశాడు.ఇప్పటికే ప్రభుత్వం సహకరించకపోయిన ..మంత్రి పదవి ఇవ్వకపోయినా కానీ తనకున్న పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున నిలబడిన కానీ గెలిచే సత్తా ఉన్న నాయకుడిగా ఎదిగిన త్రిమూర్తులు వైసీపీ తరపున బరిలోకి దిగాలని ..ఇప్పటికే జగన్ తో సంప్రదింపులు కూడా జరిపారు అని ఆ మీడియా ఛానల్ కథనం ..చూడాలి మరి త్రిమూర్తుల విషయంలో బాబు ఆస్థాన మీడియా చెప్పింది నిజమవుతుందో లేదో ..