జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ పై విమర్సలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పవన్ కల్యాణ్ సర్టిఫికేట్ అవసరం లేదని… ఏపీ ప్రజలకు ఎవరేంటో తెలుసని చెప్పారు.ఈ నాలుగేళ్లలో జరిగిన అబివృద్ది హైదరబాద్ లో కూర్చున్న వారికి ఏమి కనిపిస్తుందని ఆయన అన్నారు. పవన్ దిగజారుడు రాజకీయాలు బాధాకరమని… ఆయన వద్ద తన ఫోన్ నంబర్ ఉందని… ఏవైనా ఆధారాలు ఆయన వద్ద ఉంటే నేరుగా తనకే ఫోన్ చేసి ప్రశ్నించి ఉండొచ్చుకదా అని అన్నారు.
see also..
చంద్రబాబు సర్కార్‌పై సీబీఐ ఎటాక్..!!
8 ఏళ్లుగా తన ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్నానని.. అంతకు మించి ఎక్కువ ఆస్తులుంటే తీసుకోండని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో తనపై దుమ్మెత్తి పోస్తే, తాను దులుపుకుని పోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన నిరాధారమైన ఆరోపణలపై తాను స్పందించాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకే పవన్ రేటింగ్ ఇస్తారా? అంతేకాదు చంద్రబాబుకు రెండున్నర మార్కులు వేయడానికి పవన్‌కల్యాణ్ ఎవరని ప్రశ్నించారు అంటూ ధ్వజమెత్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేయాలా? వద్దా? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుందని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ అభిమానులు, వైసీపీ అభిమానులు రాష్ట్రానికి అది చేశాం, ఇది చేశాం అంటూ లోకేష్ తన తండ్రి చంద్రబాబును మించి ఆవుకద చెప్పినట్లుగా ఉందని నెటిజన్ల్ అంటున్నారు.
see also..