హిందీ టీవీ చానెళ్లలో టాప్ టీఆర్‌పీ రేటింగ్ ఉన్న సీరియల్ ‘కుండలి భాగ్య’. సీరియల్ క్వీన్ ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సీరియల్ చాలా పాపులర్ అయింది. ఈ సీరియల్‌తో బాగా పాపులర్ అయిన నటి శ్రద్ధ ఆర్య ‘కుండలి భాగ్య’సీరియల్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రద్ధ ఆర్య ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాత వీడియో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో శ్రద్ధతోపాటు ఆమె స్నేహితులు టవల్ కట్టుకొని… రాణి ముఖర్జీ, ప్రీతి జింటా పాట ‘పియా పియా’కు స్టెప్పులు వేశారు. ప్రారంభంలో చూడటానికి ఈ వీడియో క్యూట్‌గా అనిపించినప్పటికీ అంత అనుకున్నట్టు సాగలేదు. ముగ్గురు దగ్గరగా ఉండి.. స్టెప్పులు వేస్తుండటంతో సమన్వయం కొరవడి.. ఒక డ్యాన్సర్ చేయి.. గట్టిగా శ్రద్ధ కంటికి తగిలింది. దీంతో తను బాధతో అరవడం.. ఆమె స్నేహితులు కూడా షాక్ తినడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
