తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లి వై జంక్షన్లో ఉన్న టీఆర్ఎస్ కార్యాలయం గోడల మీద రూపుదిద్దుకున్న రాష్ట్ర ఐటీ శాఖ,మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తొలి షేడ్ ఆర్ట్ చిత్రం స్థానిక ప్రజలను ఆకట్టుకుంటుంది.
ఈ కేటీఆర్ షాడో చిత్రం మంత్రి కేటీఆర్ ను కూడా ఎంతలా ఆకట్టుకుందంటే సోషల్ మీడియాలో తన అధికారక ఖాతా ట్విట్టర్ లో సైతం వెంటనే స్పందించే అంతగా చేసింది.
అయితే ఈ చిత్రం గీసింది గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం నాయకులు పాటిమీది జగన్మోహన్ రావు.అయితే జగన్ కు ఈ చిత్రమేమి మొదటది కాదు.గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ల బొమ్మలను గీసి వారి మెప్పును పొందారు.అయితే ఒక్క రోజే కొన్ని వందల మంది సెల్ఫిలు దిగారంటే అర్ధం చేస్కోవచ్చు అది ఎంతమందిని ఆకట్టుకుందో ..