ఆయన ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం.తొమ్మిదేళ్ళ టీడీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి బాబును చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన మహానేత .ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .ఆయన తనయుడు అంటే ఎలా ఉండాలి ..ఏసీ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలి .తండ్రి ఆస్తుల వాటాల కోసం ఆరాటపడాలి .కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తన తండ్రి చనిపోతే తన తండ్రి మృతి తట్టుకోలేక ప్రాణాలు కోల్పయిన వైఎస్సార్ అభిమానుల కోసం,ప్రజల కోసం ఓదార్పు యాత్ర చేపట్టాడు.
See Also:వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే -కన్ఫామ్ చేసిన యెల్లో మీడియా ..!
తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ..తన తండ్రిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి పార్టీ పెట్టాడు.అప్పటి పాలక ప్రతిపక్షాలు ఎన్ని అవమానాలకు గురిచేస్తున్న ..ఎన్ని అక్రమ కేసులను పెడుతున్న కానీ ఆయన చిన్న చిరునవ్వుతో ఎదుర్కుంటూ గత ఎనిమిది ఏళ్ళగా ఐదున్నర కోట్ల ఆంధ్రుల పక్షాన పోరాడుతున్నారు ఆయనే వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డితో సోషల్ మీడియాలో వైసీపీ తరపున పోరాడుతున్న శరత్ కుమార్ దాసరి అనే నెటిజన్ తో ఒకతను షేర్ చేసుకున్న జగన్ కు సంబంధించిన పర్సనల్ విషయాల్లో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టి షేర్ చేశాడు.అది ఉన్నది ఉన్నట్లుగా మీకోసం ..
See Also:లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
“ఈ ఒక్క ఉదాహరణ చాలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత మొండోడు, ఆయనకి ప్రజలకి మంచి చెయ్యాలి అనే కమిట్మెంట్.ప్రేమను పంచడం లో అభిమానులని గుర్తు పెట్టుకోవడం లో ఆప్యాయతలలో జగన్ తర్వాతే ఎవరైనా. నిన్న పాదయాత్రలో జగన్ తో కలిసి నడుస్తూ వున్నప్పుడు మాటల సందర్భంలో 2010 ఓదార్పుయాత్రలో జగన్ కు మా ఇంట్లో ఆతిధ్యం ఇచ్చిన సంగతి గుర్తు చేసుకొని మాట్లాడారు. అప్పుడు జగన్ ఆహారపు అలవాట్లు తెలియక నేను ఇంట్లో చికెన్ వండించాను కానీ జగన్ చికెన్ తినకుండా పెరుగన్నం తిన్నారు. ఆ విషయం అడగగా జగన్ తాను చికెన్ తినకపోవడానికి గల కారణం చెప్తూ ” నాకు చిన్నప్పుడు చికెన్ బాగా ఇష్టం రవి కానీ ఒక ఎలెక్షన్ నాయనకు బాగా టఫ్ అవుతా వున్నింది అప్పుడు మొక్కున్నాను ఈ ఎలెక్షన్ లో నాయన గెలిస్తే ప్రజలకి మంచి జరుగుతుంది..
See Also:ఆ ముగ్గురు ఫిరాయింపు YSRCP ఎంపీలు బ్యాక్ టూ హోమ్ ..!
గెలిస్తే నాకు బాగా ఇష్టమైనది వదిలేస్తాను అని , ఆ ఎన్నికల్లో నాయన గెలిచాడు మొక్కు ప్రకారం ప్రకారం నాకు బాగా ఇష్టం అయినా చికెన్ తినడం మానేసాను” ఈ కారణం తో చికెన్ తినడం మానేసాను అని జగన్ నాతో చెప్పారు.నా 4512 కార్ నంబర్ కూడా జగన్ గుర్తుపెట్టుకోటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది… మిగిలిన అనుభవాలు మీతో తరువాత షేర్ చేసుకుంటాను.. నన్ను సొంత తమ్ముడిలా భావించి నా పట్ల అన్న చూపిన ప్రేమకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అని రవి(Ravindra Ippala,నెటిజన్ ) అనే వ్యక్తీ పంచుకున్న అభిప్రాయాన్ని షేర్ చేశాడు దాసరి .ఇప్పుడు చెప్పండి తండ్రి ఆస్తుల కోసం ..తండ్రి తర్వాత పదవులను ఆశించిన వారి కంటే తన తండ్రి గెలుపు కోసం చిన్నతనం నుండి ఎంతో ఇష్టమైన చికెన్ వదులుకున్న జగన్ వంద రెట్లు గొప్పోడు కదా ..