వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయట. ఇప్పుడీ వార్తే సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా కథనానికి కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఓ సారి ఆ కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు.
చివరకు జగన్‌ను నేరుగా అడ్డుకోలేక, దొడ్డిదారిన జగన్‌పై కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయించిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ విషయం జగమెరిగిన సత్యమే. అయినా, వైఎస్ జగన్ జంకలేదు. నాడు, దేశంలోని రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి భయపడుతున్న సందర్భంలో.. సోనియా గాంధీని ఎదిరించి మరీ కొత్త పార్టీ పెట్టారు వైఎస్ జగన్. అలా, నాడు సోనియా గాంధీని ధిక్కరించి రాజకీయ పార్టీ పెట్టి వైఎస్ జగన్ చరిత్రకెక్కారు.
see also : లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
నేడు, ప్రత్యేక హోదా విషయంలోనూ ప్రధాని మోడీపై ఎదురు దాడి చేసేందుకు వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రత్యేక హోదా సాధిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు తిరుపతి వేంకన్న సాక్షిగా మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం చేపట్టాక వారు మాట మార్చారని, కానీ, వైఎస్ జగన్ మాత్రం ప్రత్యేక హోదాపై నాటి నుంచి నేటి వరకు ఒకే మాటపై నిలుస్తూ ప్రజలకు అండగా ఉన్నారన్నది సోషల్ మీడియా కథనం సారాశం.
ఏదేమైనా, ప్రధానిమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఎదిరించిన విధానం రాజకీయ చరిత్రలో లిఖించబడుతుందని రాజకీయ విశ్లేషకుల మాట.