సిడ్నీ లో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ ఆర్ ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్‌పై ప్రవాసులు ప్రపంచమంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారని , ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారని తెలిపారు అలాగే ఫెడరల్ ఫ్రంట్ దిశగా తొలి అడుగు కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా_బెనర్జీతో బేటీ భారతదేశంలో రావాల్సిన గుణనాత్మక మార్పు కు ,బంగారు భారతదేశం నిర్మిచేందుకు పడ్డ ఈ తొలి అడుగు భావి తరాలకు మార్గదర్శకం కావాలని, అఖండ భారతదేశం కోసం రాముడు మళ్ళీ రామరాజ్యం స్థాపనకి ఈ అడుగు దిగ్విజయం కావాలని తెలిపారు.
see also..
లేటెస్ట్ సొంత సర్వే-చంద్రబాబుకే చుక్కలు కన్పించాయి అంట ..!
టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో భాగంగా అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని పెరుగుతున్న ధరల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్నిరూ. 75,116/- నుండి రూ. ఒక లక్ష నూటా పదహారుకు (1,00,116/-) ఆర్థిక సాయాన్ని పెంచినందులకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్బంగా ప్రవాసుల పక్షాన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా గల్ఫ్ తెలంగాణ వాసుల కష్టాలు తీర్చేందుకు ఈ 100 కోట్ల బడ్జెట్ ఉపయోగపడే అవకాశం చాలా ఉందని, కచ్చితంగా ఈ చరిత్రాత్మక నిధుల కేటాయింపుతో గల్ఫ్ బిడ్డల జీవితాల్లో కొత్త భరోసా కలుగుతుందని, ఈ నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తూ, తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా వారి సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న కృషి గొప్పదని వారిని ప్రశంసించి కృతఙ్ఞతలు తెలిపారు.గత పాలకులకు ఎన్నారైల పట్ల చిత్తశుద్హి లేదని, తెలంగాణ ఏర్పడక ముందు ఏన్నారై శాఖ బడ్జెట్ కేవలం రూ. 5 కోట్లు ఉండేదని, వారి సంక్షేమం కోసం చేసిన పనులేవీ లేవని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్ల అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నారని, ముఖంగా గల్ఫ్ బాధితుల పట్ల ఎప్పటికప్పుడు కేటీఆర్, ఎంపీ కవిత స్పందిస్తున్న తీరు, వారి బాధ్యతకు, గల్ఫ్ బిడ్డల సంక్షేమం పట్ల వారి చిత్తశుద్ధిని తెలుపుతున్నదన్నారు.ఈ సమావేశంలో విక్రమ్ కటికనేని , జస్వంత్ కొడారపు, రవి ధూపాటి,పరశురామ్ ముటుకుల్లా,లక్ష్మణ్ నల్లాన్, రవి సూరిశెట్టి ,వరుణ్ నల్లెల్ల , ఎండీ ఇస్మాయిల్ ,అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.