తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో అక్కడున్న అవసరాన్ని బట్టి గోడౌన్ల ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.నూతనంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్ల కు సంబంధించి నాబార్డ్ ఇప్పటికే ప్రణాలికలు సిద్దం చేస్తుందన్నారు.ఆ నివేదిక రాగానే గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
see also :హాట్సాఫ్ హరీష్ రావు..!!
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 364 గోడౌన్లను నిర్మించామని చెప్పారు. గోడౌన్ల నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 818.14 కోట్లు చేశామని … 18.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను ఒక సంవత్సరంలోనే పూర్తి రైతులకు వినియోగంలోకి తేవడం జరిగిందన్నారు.రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ..కొత్త గోడౌన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని..త్వరలోనే కొన్ని కోల్డ్‌స్టోరేజీలను ఏర్పాటు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
see also :పవన్ రాజకీయంపై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!!