రాజకీయంగా నా అనుభవం 40 ఏళ్లు అని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి.. తీరా అధికారం చేపట్టాక చేసిందేమిటి..? సింగపూర్‌లా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దతానంటూ ప్రజలను మభ్యపెట్టి అమరావతి నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డాడా..? విశాఖ భూ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఎంత..? సీఎం రమేష్‌కు మళ్లీ రాజ్యసభ సీటు కేటాయించడం వెనుక బినామీ ఆస్తులే కారణమా..? టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి అవినీతిలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సంబంధం ఉందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన దాంట్లో వాస్తవమెంత..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తనపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా.. వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన.. అవినీతి ఆరోపణలు నిజం కావంటూ ఆధారాలతో సహా నిరూపించుకుంటారు. కానీ, పై ప్రశ్నల్లో ఏ ఒక్కరు కూడా ఆ పనిచేయకపోవడంతో ఏపీ ప్రజలు చంద్రబాబుపై, నారా లోకేష్‌పై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని నమ్మే పరిస్థితి వచ్చింది.
see also : పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
see also : ఏపీలో సంచలనాత్మక లేటెస్ట్ సర్వే ..ఆ ఒక్క పార్టీకే అన్ని స్థానాలు ..!
అయితే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణుక్యతతో ఇప్పటికే ఏపీ ప్రజలను మభ్యపెట్టి అవినీతికి విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కుఠిల రాజకీయ చాణుక్యతను పార్లమెంట్ వేదికగా బయటపెట్టాడు చంద్రబాబు. ఇక అసలు విషయానికొస్తే, ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ అసెంబ్లీ సాక్షిగా వైసీపీకి మద్దతిచ్చిన చంద్రబాబు, తీరా మళ్లీ వెనకడుగు వేశారు. మేమే కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతామంటూ చెప్పారు చంద్రబాబు.
see also : ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!
see also : దేశంలో మరో బ్యాంకు కుంభ కోణం ….!
సరే, పార్లమెంట్‌లో అవిశ్వాసం పెట్టిన చంద్రబాబు, ఆ తీర్మానం చర్చకు వచ్చినప్పుడల్లా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేయడం, ఆ తీర్మానంపై చర్చ ఆగిపోయేలా చేయడం టీడీపీ ఎంపీలకే చెల్లింది. అసలు, అవిశ్వాస తీర్మానంపై గత శుక్రవారమే చర్చ జరగాల్సి ఉండగా, టీడీపీ ఎంపీల తీరు కారణంగా స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. పోనీ, సోమవారమైనా అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగిద్దామని భావించిన స్పీకర్‌కు మళ్లీ టీడీపీ ఎంపీలు అడ్డు తగిలారు. ఇలా అటు ప్రత్యేక హోదా సాధిస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో ఏపీ ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన చంద్రబాబు, నేడు ప్రత్యేక హోదా కోసం వైసీపీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడల్లా, చర్చ కొనసాగకుండా ఆందోళన చేయడం టీడీపీ ఎంపీల వంతైంది. ఇలా, చంద్రబాబు అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా తమ పార్టీ ఎంపీలతో ఆందోళన చేయించడం ఎంత వరకు సమంజసమని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.