జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పిర్యాదు చేశారు.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు
తమ్ముళ్ళు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.
ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడుతో సహా నలబై మంది టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.బాబుతో సహా వారందరిపై విచారణ జరపాలని కేంద్ర సర్కారును ,ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కోరారు.అయితే అవినీతికి పాల్పడుతున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసునన్నారు.
అయితే ఇటివల ఒక మంత్రి ఏకంగా పర్సంటేజీల గురించి బహిరంగంగానే వ్యాఖ్యానించారని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.అయితే గత కొంతకాలంగా పవన్ బాబు అండ్ బ్యాచ్ పై విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే ..