బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని
ఆలోచిస్తున్నారా ..
అయితే అసలు విషయానికి వస్తే టీం ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండరీ ఆటగాడు ఎంఎస్ ధోనీ జట్టులో ఉన్న లేకపోయిన కానీ ఆటగాళ్ళకు ఎంతో స్పూర్తినిస్తారు అని ఏకంగా భారత్ క్రికెటర్లే స్వయంగా పలు మార్లు చెప్పారు .తాజాగా ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టడంపై మహీ అభిమానులు స్పందిస్తూ నిదహాస్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తూ చేసిన సమయంలోనూ ధోనీ ఉన్నాడు .అవును కీపింగ్ తో పాటుగా మ్యాచ్ ఫినిషింగ్ బాధ్యతలు కూడా తీసుకున్న దినేష్ కార్తిక్ ప్లేస్ లో ధోనీను చూసుకుంటున్నాము ..
చిరునవ్వులు చిందిస్తున్న దినేష్ ను కట్టేసి ముసుగు తీస్తే ధోని కనిపిస్తాడు అనే అర్ధం వచ్చే విధంగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనికి దినేష్ కార్తీక్ స్పందిస్తూ బహుశా నాకు ఈ శక్తి ధోనీ నుండే వచ్చి ఉండొచ్చు ..ఎందుకంటే ఎంతటి కష్ట సమయంలో అయిన టెన్షన్ లో అయిన మాములుగా ఉండగల శక్తి ఒక్క ధోనీ కే సాధ్యం ..మ్యాచ్ ను ఫినిష్ చేయడం ధోనీ నుండే నేర్చుకున్నాను..అందుకే ఈ మ్యాచ్ ను గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ అని ట్వీట్ చేశాడు కార్తీక్ ..