జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు.
see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..!
see also :హాట్సాఫ్ హరీష్ రావు..!!
పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం అని పేర్కొన్నారు. ఈ పథకం వ్యక్తిగతంగా తన హృదయానికి దగ్గరైన పథకం అని అన్నారు.ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ.75,116 నుండి రూ. 1,00,116లకు పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని పెండ్లి రోజునే అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మొదట రూ. 51 వేలు, ఆ తర్వాత రూ. 75 వేలకు పెంచారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల 65వేల మంది మహిళలకు లబ్ధి చేకూరింది .
see also :ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..!!