ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రం.కేవలం రెండు అంటే రెండు శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని దూరం చేసుకోగా..టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇదే అంశం మీద ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ,పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ తో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడం..టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు .మేము ఇచ్చిన మద్దతుతో గెలిచిన చంద్రబాబు ఇప్పుడు ఇలా మాట్లాడటం తమపై విమర్శలు చేయడం ఊసరవెల్లి రాజకీయాలతో సమానం అన్నారు .అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవుతారా అని అడగ్గా పైన మాట్లాడిన విధంగా సమాధానమిచ్చారు విష్ణు కుమార్ రాజ్ ..
