చివరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్నందించిన దినేశ్ కార్తీక్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాటే. నిదహాస్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసిన వాళ్లు పొందిన అనుభూతే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరిచిపోలేడు.భారత్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో చేయాల్సింది 34 పరుగులు. ఇక భారత్ గెలవడం కష్టమే అని భావించిన ఎంతో మంది అభిమానులు తమ టీవీలు ఆఫ్ చేసి పడుకునే ఉంటారు.
see also..
ఏపీలో హోంగార్డు ఆంటీతో అక్రమ సంబంధం..చివరకు ఏమైయ్యింది..!
మధ్య రాత్రిలో ఫోన్ చూసుకున్న వారు, సోమవారం తెల్లవారుజామున ఏ దినపత్రిక చూసిన వారు అరె రాత్రి మ్యాచ్ చూడలేకపోయామే అని అనుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో!. చివరివరకూ అభిమానుల మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. ఒక్కసారిగా హీరో అయిన కార్తీక్ గురించే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి కొట్టిన సిక్స్ చూశారా అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక మీరు కూడ ఆ చివరి బాల్ సిక్స్‌ను చూడండి.
https://twitter.com/dineshdones/status/975562533661757441