ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల నాలుగు ఏళ్ళ పాలనపై ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్కులు వేశారు.
ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ ను అడిగిన బాబు పాలన బాగుందా..కేసీఆర్ పాలన బాగుందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు బాగుంది.గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఇటు రాష్ట్ర ప్రజల మన్నలని పొందటమే కాకుండా ఏకంగా దేశానికి దిశ నిర్దేశం చేస్తున్నారు.
అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరు మార్కులు ..అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన పార్టీకి చెందిన నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాల వలన రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టింది.ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు.అవినీతిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నింపారు.అందుకు బాబుకు రెండు మార్కులు వేస్తున్నాను .అయితే ఈ మార్కులు పదికి అని పవన్ తెలిపారు ..