ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్) ఫలితాలు ఈ సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గేట్ వే హోటల్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 4,14,120 మంది టెట్ పరీక్ష రాశారని, పేపర్-1లో 57.88 శాతం, పేపర్-2లో 37.26 శాతం.. పేపర్-3లో 43.60 శాతం మంది అర్హత సాధించారని గంటా తెలిపారు. ఫలితాల వివరాలనుఈ ఫలితాలను https://cse.ap.gov.in, aptet.apcfss.in లో చూడవచ్చని ఆయన స్పష్టంచేశారు.
