వైసీపీ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా మహిళ నేతలపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దూషణల పర్వం రోజు రోజుకు హద్దులు దాటిపోతుంది.ఈ క్రమంలో గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామేపల్లి లో తుమ్మల చెరువు గ్రామంలో జరిగిన దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
జబర్దస్త్ కార్యక్రమాలను చేస్కోకుండా రాజకీయాలు అవసరమా ..అసలే అమెది ఐరన్ లెగ్ .ఆమె ఏ పార్టీలో ఉంటె ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు.అయిన వైసీపీ నేతలకు టీడీపీ కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని విమర్శించే అర్హత లేదని ఆయన ఆరోపించారు ..
