ఉగాది పండుగ పర్వదినాన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌తోపాటు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా అందర్నీ ఏకిపారేస్తూ సుహ సందీపిక అనే మహిళ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోసల్ మీడియాలో ఆ వీడియో అంతలా వైరల్ అవడానికి కారణాలు లేకపోలేదు మరీ. సుహ సందీపిక ఆ వీడియోలో పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఏం మాట్లాడిందంటే ..!!
see also : పవన్, బాబుల గురించి పచ్చి నిజాలు చెప్పిన సినీహీరో..!!
see also : వైఎస్ జగన్ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!
మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీవు.. మహిళలకు ఏం రక్షణ కల్పిస్తావని ప్రశ్నించింది. మూడు పెళ్లిళ్లే కాకుండా, సినీ ఇండస్ర్టీలో నీకున్న అక్రమ సంబంధాలగురించి ప్రజలకు ఏం చెప్తావు..? కుక్కలు, నక్కలు కన్నట్టు పిల్లల్ని కని, భార్యలకు విడాకులు ఇచ్చి రోడ్డున వదిలేస్తావా..? ఆడ మనిషిని ఎలా గౌరవించాలో తెలియని వ్యక్తిత్వం నీది. ఒక రాజకీయ పార్టీ అంటూ స్థాపించిన నీవు.. పార్టీకి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించకుండానే జనసేన ఆవిర్భావ సభలో ఓట్లేయమని ఎలా అడుగుతావు..? ఓట్లు అడగడంతో మీకొక రూలు.. వేరొకరికి ఇంకో రూలా..? అంటూ ప్రశ్నించింది సుహ సందీపిక. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి వచ్చే ముందు.. నీ ఫ్యామిలీ లైఫ్‌ను సెట్ చేసుకోవాల్సింది అంటూ పవన్ కల్యాన్‌కు సలహా ఇచ్చింది.