దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫ్రంట్ కార్యరూపానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన రేపు ( సోమవారం ) కోల్‌కతా వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆయన భేటీ అవుతారు. మమతతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధానంగా ఫ్రంట్ లక్ష్యాలు, జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, ఎజెండా తదితర అంశాలు చర్చించే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పర్యటన తరువాత వివిధ పార్టీల నాయకులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.
see also :ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్
see also :కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన గవర్నర్ కి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు
కేసీఆర్ పర్యటన షెడ్యూల్
- ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలకు హాజరై మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయలుదేరుతారు.
- మధ్యాహ్నం రెండు గంటలకు కోల్‌కతాలోని సుభాష్‌చంద్రబోస్ విమానాశ్రయంలో దిగి హోటల్ తాజ్ బెంగాల్‌లో విడిది చేస్తారు.
- మధ్యాహ్నం 3.15 గంటలకు పశ్చిమబెంగాల్ సచివాలయంలో ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ అవుతారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళీమాత మందిరాన్ని దర్శించుకోనున్నారు. రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
see also :తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పండి… కేంద్ర మంత్రిని సూటిగా ప్రశ్నించిన కేటీఆర్