తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతిభవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలందరు సకల సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధించానన్నారు.ఇవాళ స్వీకరించే ఉగాది పచ్చడి సందేశాత్మకంగా ఉంటుంది. తీపి, వగరు, పులుపులాగే జీవితం కూడా ఉంటుందన్నారు.
see also :ప్రగతిభవన్ లో సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన పంచాంగం ఇదే.!!
రాష్ట్రంలో రైతాంగం అంతా చాలా సంతోషంగా ఉన్నారని..తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సిరిసంపదలతో తులతూగుతుందని పంచాంగకర్తలు చెప్పారన్నారు.. తెలంగాణ రాష్ట్రం రాశి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2 కావడం వల్ల.. రాష్ట్రం తప్పకుండా సుసంపన్నంగా ఉంటుందని చెప్పారు. పోలీసు శాఖ సమర్థవంతంగా పని చేస్తుందని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు.
see also :తెలంగాణ ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఉగాది కానుక ..!
ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కాబట్టి పంచాంగంలో చెప్పినట్లు ఏ నాయకుడికి కూడా ఢోకా లేదని… టికెట్లు సంపాయించుకోవాలి అంటే హైదరాబాద్‌లో కాకుండా.. ప్రజల్లో ఉండాలన్నారు.. ప్రజల్లో ఉన్నవారిదే గెలుపు అని స్పష్టం చేశారు.అన్ని వర్గాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహిస్తుందని..అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా చిరునవ్వుతో బతకాలని కోరుకుంటున్నాని సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
see also :2019లో జగనే సీఎం..అది జరక్కపోతే మేము పంచాంగం చెప్పం..!