చంద్రబాబు ఊహించని పరిణామం..! ఈ దెబ్బతో లోకేష్ జైలుకే..!! అవును, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో.. తన తనయుడు నారా లోకేష్ జైలుకు వెళ్లనున్నాడు. అయితే, నారా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా దొడ్డిదారిన మంత్రి పదవిని సొంతం చేసుకున్నాడు.. అంతేకాదు. మంత్రి పదవి చేపట్టినప్పట్నుంచి అటు పంచాయతీ రాజ్ శాఖ నుంచీ.. ఇటు ఐటీశాఖలో భారీ అవినీతికి పాల్పడ్డాడు.. ఏపీలో జరుగుతున్న అవినీతి రాజకీయాల్లో నారా లోకేష్‌దే ప్రముఖ పాత్ర అంటూ ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అన్న విషయం తెలిసిందే.\
see also : ఇద్దరు ముఖ్యమంత్రులంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!! అవును,
see also : వైఎస్ జగన్ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!
అంతేకాదు, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు, శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తులో నారా లోకేష్ వాటా ఎంతో కూడా బయటపెడతానంటూ నంటూ జనసేన ఆవిర్భావ సభ వేదిక పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, పవన్ కళ్యాన్ ఈ వ్యాఖ్యలన్నీ పక్కా ఆధారాలతోనే చెప్పాడన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాన్… తీరా చంద్రబాబు అవినీతిని దగ్గరుండి చూడటంతో పవన్ కల్యాణ్ ఇలా యూ టర్న్ తీసుకున్నాడని, ఆ నేపథ్యంలో నారా లోకేష్ అవినీతిపై సేకరించిన పక్కా ఆధారాలు పెన్‌డ్రైవ్‌లో భద్రంగా ఉన్నాయని, వాటిని గనుక జనసేన అధినేత పవన్ కల్యాణ్ బయటపెడితే నారా లోకేష్‌కు జైలే గతి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరి, నారా లోకేష్ అవినీతికి సంబంధించిన ఆధారాలు, పెన్‌డ్రైవ్‌లను పవన్ కల్యాణ్ ఎప్పుడు బయటపెడతాడో..! వేచి చూడాలి..!!