అమ్మాయిలను బుక్ చేసుకునే నువ్వెంత.. నీ బతుకెంత..!! పవన్ కల్యాణ్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!! ఇటు సినీ ఇండస్ర్టీలోనూ.. అటు రాజకీయపరంగానూ.. మెగా హీరోలు, నందమూరి హీరోల మధ్య వార్ తారా స్థాయిలో నడుస్తోంది. ఇప్పటి వరకు చాపకింద నీరులా సాగిన ఈ యవ్వారం.. ఇప్పుడు మీడియా సాక్షిగా బట్టబయలు అవుతున్నాయి. అయితే, చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసుల గురించి తెలిసి కూడా 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ కల్యాణ్ తన శాయశక్తులన్నీ ఒడ్డిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకుని మరీ.. టీడీపీ తరుపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశాడన్న కామెంట్లు సోషల్ మీడియాలో హల్‌చేశాయి.
ఈ నేపథ్యంలో బుధవారం నాడు గుంటూరు వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిని ఓ రేంజ్‌లో ఏకి పారేశాడు. 2014 ఎన్నికల్లో, ఆ తరువాత చంద్రబాబు పాలన గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలనే.. పవన్ కల్యాణ్ తన జనసేన ఆవిర్భావ సభలోనూ చెప్పాడన్న కామెంట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేశారు కూడాను.
see also : అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..!
see also : అవును, అవినీతి చేస్తాం..! మీ కేంటి..!!
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదని బాలకృష్ణ,.. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని పవన్ కల్యాణ్… ఇలా ఒకరిపై మరొకరికి ఉన్న విభేదాలను బాహాటంగానే వెలిబుచ్చారు. తాజాగా ఈ వ్యాఖ్యలు తారా స్థాయికి చేరాయి.
see also : వైఎస్ జగన్ గోడమీద పిల్లిలాంటి వాడు..!!
అయితే, నేడు హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణను విలేకరులో ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే..? జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ..మీ అల్లుడు లోకేష్ అవినీతి చేశాడంటూ వ్యాఖ్యానించారు కదా..? పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏమిటని ప్రశ్నించగా, పవన్ కల్యాణా..! అతడెవరు..? అమ్మాయిలను బుక్ చేసుకునే వాళ్ల గురించి నేను మాట్లాడను అంటూ బాలకృష్ణ తన మనసులోని మాటను మీడియా ముఖంగా చెప్పారు. అనవసరంగా అటువంటి వాళ్లను హీరోలను చేయడం వేస్ట్, నేనే సూపర్ హీరో అంటూ వ్యాఖ్యానించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.