Home / ANDHRAPRADESH / అవును, అవినీతి చేస్తాం..! మీ కేంటి..!!

అవును, అవినీతి చేస్తాం..! మీ కేంటి..!!

అవును, మేం అవినీతి చేస్తాం..! మీ కేంటి..!! టీడీపీ నేత‌లు అంటున్న మాట ఇదే..!! 2014 ఎన్నిక‌ల్లో మోస‌పూరిత హామీలు ఇచ్చి అధికారం చేప‌ట్టాక రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు… ప్ర‌జ‌ల‌కు ఆకాశాన్ని చూపించి.. నేల‌ను దోచేసిన తీరు చంద్ర‌బాబుది.. అగ్రిగోల్డ్‌, విశాఖ భూ కుంభ‌కోణం, ఇసుక దోపిడీ, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా కాల్ మ‌నీ, సెక్స్ రాకెట్ ఇలా చంద్ర‌బాబు హ‌యాంలో జ‌ర‌గని అవినీతి లేదంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ల‌క్ష‌ల్లో కామెంట్లు చేసిన‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు అవినీతి మాత్ర‌మే తెర‌పైకి రాగా.. ఇప్పుడు తాజాగా త‌న త‌న‌యుడు నారా లోకేష్‌ అవినీతి ఖాతా తెరిచాడా..? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

see also : ఆ హీరో సినిమాలో ఛాన్స్ కోసం..టాప్ హీరోయిన్లలో ఒకరు..పడక సుఖం

see also : ఇది ఖ‌చ్చితంగా కొత్త రోజే..ఫోటో షేర్ చేసిన చైతూ..!!

రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌ల‌కు కార‌ణాలు లేక‌పోలేదు. అయితే, ఆ కార‌ణాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. బుధ‌వారం నాడు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ ప్రాగణంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాన్ త‌న పార్టీ ఆవిర్భావ స‌భ ఆధ్యాంతం గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు స‌ర్కార్ చేస్తున్న అవినీతిపాల‌న‌, అవినీతిలో చంద్ర‌బాబు పాత్ర‌తోపాటు నారా లోకేష్‌, ఏపీ మంత్రుల అవినీతిని ఏకి పారేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. 2014లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పుచేశానంటూ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ సాక్షిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవేద‌న చెందిన విష‌యం తెలిసిందే.

see also : పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో పూనం కౌర్‌కు ప్రాణహాని..!

ఈ సందర్భంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుడు శేఖ‌ర్‌రెడ్డి, నారా లోకేష్ మ‌ధ్య ఉన్న అవినీతి లావాదేవీల గురించి బ‌హిర్గతం చేశారు. అయితే, పెద్ద‌నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో శేఖ‌ర్‌రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ, సీబీఐ, ఈడీ, విజిలెన్స్ అధికారులు 180 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, 117 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే, నారా లోకేష్‌, శేఖ‌ర్‌రెడ్డిల అవినీతిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న మాట‌ల‌ను టీడీపీ పెద్ద‌లు ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏ రాజ‌కీయ పార్టీ నాయ‌కుడైనా త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వారిపై.. నేను అలా చేయ‌లేదు అంటూ ప్ర‌తిదాడికి దిగ‌డం స‌హ‌జం. కానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి, స్వ‌యాన ముఖ్య‌మంత్రి త‌న‌యుడు నారా లోకేష్ ఖండించ‌క‌పోవ‌డం శోచ‌నీయం. ప‌వ‌న్ క‌ల్యాన్ మ‌నోడేలే.. ఏం మాట్లాడినా మ‌న గురించి ఆలోచించే మాట్లాడుతాడులే అని అనుకున్నారా..? లేక అవినీతి చేస్తాం..! మీకేంటి..!! అనుకున్న‌ట్లా..!! ఏమో.. దీనికి టీడీపీ నేత‌లే స‌మాధానం చెప్పాలి..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat