తెలుగువారు ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ ఉగాది.ఉగాది పండుగ ప్రతి యేట చైత్ర మాసం శుక్ల పక్షంలో పాడ్యమి రోజున జరుపుకుంటారు.ఉదయాన్నే లేచి తల స్థానం చేసి కొత్తబట్టలు ధరించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి .ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడిని చేస్తారు.అలాగే తియ్యని భక్షాలు కూడా చేస్తారు.భక్షల్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి.అంతే కాకుండా ఉగాది రోజు చాలా వంటకాలు చేస్తారు. అందులో ముఖ్యమైన వంటకాలు మీ కోసం..
మామిడికాయ పులిహోర
భక్షాలు
శనగపప్పు భక్షాలు
క్యారెట్ భక్షాలు
కొబ్బరి భక్షాలు
బొబ్బర్ల భక్షాలు
గసగసాల పాయసం
అరటికాయ బజ్జి
నెయ్యి అప్పం
వేప పువ్వు ముద్ద కూర
చింతపండు పచ్చి పులుసు
మిరియాల ఫ్రైడ్ రైస్
చెరకురసం ఖీర్
మామిడికాయ డ్రింక్