ఉగాది నుంచి ఈ మూడు రాశుల వారి జాతకం మారనుంది. వాస్తవానికి మనకి 12 రాశులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే, 2018 ఉగాది అన్ని రాశుల వారికి బాగానే కలిసొచ్చినా.. కొంచెం లంక్ అనేది యాడ్ అయ్యేది మాత్రం ఆ మూడు రాశుల వారికేనట. ఉగాది తరువాత ఆ మూడు రాశుల వారికి ఎటువంటి ఆటంకం లేకుండా విఘ్నాలు లేకుండా వారి జీవితం సాగిపోతుందట. ఎప్పట్నుంచో సక్సెస్ కాని వారి ప్రయత్నాలు, కోర్టు సమస్యలు ఉగాది తరువాత సక్సెస్ కానున్నాయి. ఇంతకీ ఆ మూడు రాశులేమిటంటే..?
1) మేషరాశి : కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. అలా తీసుకున్న నిర్ణయాలే వారిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా, మొదట ఆరోగ్య సమస్యలు తలెత్తినా.. చివకు మీరే విజయం సాధిస్తారు. అయితే, ఉద్యోగానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కుటుంబంతో ఎక్కువ సేపు గడపలేకపోవడం, ఒంటరి తనానికి దారి తీస్తుంది. ఏదేమైనా చివరకు వీరిని ధనప్రాప్తి కలుగుతుందని పురోహితులమాట.
2) కర్కాటకరాశి : ఈ రాశి కలవారికి అదృష్టం వెంట ఉండటంతోపాటు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే, జీవితంలో ఎదురయ్యే ఎంత పెద్ద కష్టాన్నైనా వీరు ఒంటరిగానే ఎదుర్కొనేందుకు ఆసక్తికనబరుస్తారు. వీరి ప్రేమను ఎదుటి వారు అర్ధం చేసుకోకపోవడం వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఖర్చులు పెరగుతాయి. ఈ రాశిగల వారు చదువులో బాగా రాణిస్తారు.
3) సింహరాశి : ఈ రాశిగల వారికి ఉగాది తరువాత అద్భుత ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే వీరికి కొంత గ్రహశాంతి, నవగ్రహ ఆరాధన చాలా అవసరం, నవగ్రహ సూత్రాన్ని ఈ రెండు రాశులవారి పఠించగలిగితే అద్భుత ఫలితాలు రాబడతారు. అంతేకాక, నవగ్రహ ఆరాధన, సోమవారం శివాలయ దర్శనం చేస్తే అధిక ఖర్చులను అధిగమించగలుగుతారు. వీరి అన్ లక్, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడమే. ఆ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించినట్లయితే సింహరాశుల వారికి ఈ ఉగాది తరువాత పట్టిందల్లా బంగారం కానుంది.