తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది. అయితే తెలుగువారు ప్రతీ పండుగకు కొన్ని నియయాలను కచ్చితంగా పాటిస్తారు. అలాగే, ఉగాది రోజున కూడా పాటించాల్సిన మూడు ముఖ్య మైన నియమాల గురించి తెలుసుకుందాం..!!
1) తైలాభ్యంగన స్నానము : నువ్వుల నూనె తలమీద పట్టించుకుని, ఆ తరువాత పెద్దల ఆశీర్వచనం తీసుకుని స్నానం చేయడం వలన అలక్ష్మీ తొలగి లక్ష్మీ దేవి కఠాక్షిస్తుందని వేదపండితులు చెబుతున్న వాస్తవం.
2) వేపపూవు పచ్చడి : ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. ఉగాది పచ్చడిలోని తీపి ఒగరు జీవితంలో కష్టసుఖాలను తెలుపుతుంది. ఇలా ఉగాది పచ్చడిలోని షడ్రుచుల్లో ఒక్కో రుచికి ఒక్కో అర్థం ఉంది. అయితే, ఈ ఉగాది పచ్చడి చేసిన తరువాత మొదట పరమేశ్వరుడికి నైవేధ్యంగా పెట్టాలి. ఆ తరువాతే మనం ప్రసాదంగా తీసుకోవాలి.
3) పంచాంగ శ్రవణం : ఉగాది రోజున ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవణం వింటే మంచిదని వేదపండితుల చెబుతున్న మాట. పంచంగ అంటే ఐదు అంగములతో కూడుకున్నది. అంటే తిది, వారము, యోగము, కరణము, నక్షత్రము అన్న మాట. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం వల్ల దీర్ఘాయుష్షు కలుగుతుందని పురాన ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే, రోగనాశనం కూడా జరుగుతుంది.