ఉగాది, వాస్తవానికి ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ, అంతేకాకుండా తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగ రోజు నుంచే. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే, ఉగాది పండుగ రోజున ఏ భగవంతుడ్ని ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగచేస్తాడు అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మదిలో మెదులుతుండటం సహజం. ఉగాది పండుగ రోజున ఏ భగవంతుడ్ని పూజించాలన్న విషయంపై పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయో ఓ సారి చూద్దాం..!!
see also : వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన లోక్ సభ స్పీకర్ ..!
see also : జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి (6.30 గంటలకే, సూర్యోదయానికి ముందుగా) కాలకృత్యాలు తీర్చుకుని, ఆ తరువాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం, లేదా విష్ణుమూర్తి సహస్రనామం, లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి. భక్తితో, విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఆ సమయంలోనే సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకివ్వు, నాకు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి. అనంతరం తులసీదళములతో స్వామి, అమ్మవార్లను ఆరాధించిన తరువాత ఉగాది పచ్చడితోపాటు పాలతో చేసిన ఏదైనా పదార్థాన్ని స్వామి అమ్మవార్లకు నైవేధ్యంగా పెట్టాలి. స్వామి అమ్మవార్ల ఆరాధన కోసం ఉపయోగించిన తులసీదళాన్ని గుమ్మానికి మాలలా ఉంచి, అలాగే, ఓ తులసీ దళాన్ని మీ జేబులో ఉంచుకోవాలని, ఉగాది పండుగ రోజంతా ఆ తులసీదళం మీ ఇంటి గుమ్మానికి, అలాగే, మీ జేబులో తప్పనిసరి ఉంచుకోవాలని పురాణ ఇతి హాసాలు చెబుతున్నాయి. అనంతరం ఉగాది పండుగ సందర్భంగా చేసిన పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాతే ఆహారం తీసుకోవాలి.
see also : పవన్ కల్యాణ్ నుంచి అందరూ.. వాడుకుని వదిలేసే వారే..!!
అయితే, ఉగాది సందర్భంగా ప్రతీ ఒక్కరి ఆతృత ఒక్కటే. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మదిలో మెదిలేదే. అందుకని ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవణం చేయాలి. ఈ సంవత్సరం జాతకంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, కర్నము, వారం ఇలా అన్ని విషయాలను తెలుసుకొని పద్ధతి ప్రకారం స్వామి అమ్మవార్లను ఆరాధిస్తూ ముందుకు పోతే, అటువంటి వారి ఇళ్లలో అష్ట ఐశ్వర్యాలతోపాటు భోగభాగ్యాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.