ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకుంటారు.కొత్త యుగానికి ఆది కాబట్టి యుగాది అంటారు.ఉగాది అంటే యుగా + అది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభ సూచిక .యుగము అనగా జత అని అర్ధం కూడా ఉంది.ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితేనే సంవత్సరం .అది మొదలయ్యేది ఈ రోజే.ఉగాది రోజు నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది.ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. ఈ రోజు పొద్దునే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంబిస్తారు.ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది.ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం.
see also :ఉగాది రోజు ఇలా చేస్తే ఎవరైనా కోటీశ్వరుడు కావాల్సిందే..!!
షడ్రుచు అంటే తీపి,పులుపు,కారం,ఉప్పు,ఒగరు, చేదు అని ఆరు రుచులు.ఈ ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం.సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను ,మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది.హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక.,మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు.తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగాదిగా..మహారాష్ట్రలో గుడిపడువ గా పిలుస్తారు.
see also :ఉగాది రోజున అస్సలు చేయకూడని పనులు..!
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయతి.ఉగాది రోజే పాత లెక్కలు మూసేసి కొత్త లెక్కలు రాయటం మొదలు పెడతారు.కవులు ఉగాది పండుగ సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. ఏది ఏమైనా పకృతి గమనాన్ని అనుసరించి ..మానవాలిలో చైతన్యం వచ్చేలా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ..ఆదర్శాలను ప్రతిబింబించేల చేయటమే ఈ పండుగ ల పరమార్ధం.