తెలుగువారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉగాది .అయితే ఉగాది పండుగ రోజు ప్రతిఒక్కరి ఇంట్లో ఉగాది పచ్చడి చేస్తారు.ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం .ఈ పచ్చడి మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతిక .జీవితం అంటే అన్ని అనుభవాలకు కలిగిగినదైతేనే అర్ధావంతమనే చెప్పే భావం ఉగాది పచ్చడిలో ఉంది .ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక్క భావానికి ప్రతీకా.
- బెల్లం తీపి ఆనందానికి సంకేతం.
- పచ్చి మామిడి ముక్కలు : పులుపు కొత్త సవాళ్ళకు సంకేతం
- ఉప్పు జీవితంలో ఉత్సహం రుచికి సంకేతం.
- వేప పువ్వు చేదు భాధ కలిగించే అనుభవాలు.
- చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు.
- మిరపపొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.
ఈ విధంగా చేసిన ఉగాది పచ్చడిని ప్రొద్దునే ఇంటి ఆడవారు తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి ఉదయాన్నే ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు.
see also :18 మార్చి ఉగాది.. ఉదయం 6:31నిమిషాలలోపు ఈ విధంగా చేస్తే..