గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారం శాసనమండలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. కాంట్రాక్టర్‌ను మార్చుకోవడం కోసం పోలవరం తీసుకున్నారని అంటున్నాడు. కాంట్రాక్టర్ పాత ధరకే కడతానన్నాడు. కేంద్రమే కాంట్రాక్టర్‌ని నిర్ణయిస్తుంది. లేనిపోని అనుమానాలు సృష్టించి అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వాఖ్యలు తీవ్ర ధూమరం రేపుతున్నాయి.
see also..
జగన్‌పై ఉన్న అక్రమ కేసులపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
see also..
వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన లోక్ సభ స్పీకర్ ..!