టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో..అతనికి పూనం కి మధ్య ఏమి జరిగాయో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిటిక్ ,నటుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇటు పవన్ ఫాన్స్ కు అటు తెలుగు సినిమా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.అందులో భాగంగా నటి పూనం కౌర్ సోషల్ మీడియాలో ఎవరు పేరును మెన్షన్ చేయకుండా ఒక పోస్టు పెట్టారు.ఆ పోస్టు సారాంశం ఏమిటి అంటే “కొంతమంది తమ రాజకీయాల కోసం అమ్మాయిలను కూడా వాడుకుంటున్నారు.ఏమి చేయకున్నా కానీ చేసినట్లు తెగ పోజులు కొడుతున్నారు అని ఆమె పోస్టు చేసింది.
అయితే తమ అభిమాన నటుడు మంచి వాడు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గురించి పూనం కౌర్ నోటి ద్వారా ఇలాంటి విషయాలు వినాల్సి వస్తుందని అభిమానులు ఊహించలేదు. కొందరు అభిమానులు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు. పూనం వల్ల పవన్‌కు ఎప్పుడు పరువు పోతూనే ఉందని, అందుకే ఆమెను తొలగించేయాలని కొందరు భావిస్తున్నారు అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పూనం కౌర్‌కు ప్రాణహాని ఉందని వారు గట్టిగా చెబుతున్నారు.